డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక స్కాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిలిచిపోయిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక స్కాం అని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. నోరులేని పేద రైతుల దగ్గర నుంచి రాష్ట్ర సర్కార్ బలవంతంగా 1000 ఎకరాల పట్టా భూమిని సేకరించి, నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్లను పుట్టిన చోటే శరణార్థులుగా మార్చిందని ప్రవీణ్‌కుమార్ బుధవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనపై ఆయనను గద్దెదించుతామని అచ్చంపేటలోని వంగూరువాసులు ప్రతిజ్ఞ చేసినట్లు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిలిచిపోయిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక స్కాం అని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. నోరులేని పేద రైతుల దగ్గర నుంచి రాష్ట్ర సర్కార్ బలవంతంగా 1000 ఎకరాల పట్టా భూమిని సేకరించి, నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్లను పుట్టిన చోటే శరణార్థులుగా మార్చిందని ప్రవీణ్‌కుమార్ బుధవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనపై ఆయనను గద్దెదించుతామని అచ్చంపేటలోని వంగూరువాసులు ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన వెల్లడించారు.