నల్లమలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటన ఖరారు అయింది. దాంతో స్థానిక బీఎస్పీ పార్టీ నాయకులు మరియు ఇన్చార్జులు నారి మల్ల వెంకటస్వామి, రొయ్యల శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజక వర్గంలోని ఎనిమిది మండలాల్లో ఆర్ఎస్ పర్యటన ఉండనుంది. చారగొండ మండలంలో మొదట పర్యటన ఉండటంతో భారీ జన సమీకరణ చేస్తున్నామని అచ్చంపేట బిఎస్పి పార్టీ ఇంచార్జి నారి మల్ల […]
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటన ఖరారు అయింది. దాంతో స్థానిక బీఎస్పీ పార్టీ నాయకులు మరియు ఇన్చార్జులు నారి మల్ల వెంకటస్వామి, రొయ్యల శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజక వర్గంలోని ఎనిమిది మండలాల్లో ఆర్ఎస్ పర్యటన ఉండనుంది. చారగొండ మండలంలో మొదట పర్యటన ఉండటంతో భారీ జన సమీకరణ చేస్తున్నామని అచ్చంపేట బిఎస్పి పార్టీ ఇంచార్జి నారి మల్ల వెంకటస్వామి తెలిపారు.
పర్యటన ఇలా కొనసాగుతుంది..
ఈ నెల 14న చారగొండ, వంగూరు మండలాలలో పర్యటన చేసి వంగూరు మండలంలో రాత్రి బస చేస్తారు. అక్కడ నుండి 15 న ఉప్పునుంతల మరియు అచ్చంపేట మండలాలలో పర్యటన సాగుతుంది. తర్వాత అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి వద్ద ఎస్ఎల్బీసీ నక్కలగండి ప్రాజెక్టు సందర్శన చేస్తారు. తదుపరి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితుల తో మాటామంతీ ముగించుకుని రాత్రి అచ్చంపేటలో బస చేస్తారు. 16న అమ్రాబాద్, పదర మండలాలలో పర్యటన రాత్రి అచ్చంపేట లో రెస్ట్ తీసుకుని, 17న బల్మూర్, లింగాల మండలాలలో పర్యటన చేస్తారు.