ఖమ్మంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

దిశ, కల్లూరు: కల్లూరు పట్టణం ప్రధాన సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు స్వేరో సభ్యులు, బీఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, మాధవి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, స్వేరో సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు సంతోషంగా […]

Update: 2021-11-23 10:18 GMT

దిశ, కల్లూరు: కల్లూరు పట్టణం ప్రధాన సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు స్వేరో సభ్యులు, బీఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, మాధవి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, స్వేరో సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై అనేక దాడులు జరుగుతున్నాయని, పేద పిల్లలకు సరైన విద్య అందట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ చార్జ్ మేకతొట్టి పుల్లయ్య, బీఎస్పీ సీనియర్ నాయకులు తేళ్ళూరి తిరుమలరావు, అర్జునరావు, ఇస్నేపల్లి శ్రీనివాసరావు, గంగవరపు దేవా(తిరువూరు బీఎస్పీ నాయకులు), కల్లూరు బీఎస్పీ నాయకులు సగ్గుర్తి రామారావు, తేళ్లపుట్ట రాంబాబు, చిరంజీవి, మారేశ్, వెంకట్, స్వేరో సభ్యులు కంచ పోగు నాగరాజు, మడిపల్లి పూర్ణ, హనుమంత్, మోదుగు నాగరాజు, మేడి వెంకటకృష్ణ, కుమారి నర్మద స్వేరో తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News