సైరన్ మోగిస్తూ వచ్చిన దుండగులు.. రూ.20లక్షలు చోరీ

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అచ్చం మూవీ సీన్ మాదిరిగానే వైజాగ్‌లో ఓ దొంగతనం జరిగింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు దుండగులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి రూ. రూ.20 లక్షలు దోచుకెళ్లారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన విశాఖపట్టణంలోని మధురవాడలో మంగళవారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. మధురవాడకు చెందిన రియల్టర్ కోటేశ్వరరావు ఓ స్థలం కొనుగోలు విషయంపై మరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వెంకటేశ్వర్లను కలిశాడు. అనంతరం ఇద్దరు కలిసి నగర శివారులోని ఓ స్థలాన్ని ఇవాళ […]

Update: 2020-08-18 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అచ్చం మూవీ సీన్ మాదిరిగానే వైజాగ్‌లో ఓ దొంగతనం జరిగింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు దుండగులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి రూ. రూ.20 లక్షలు దోచుకెళ్లారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన విశాఖపట్టణంలోని మధురవాడలో మంగళవారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. మధురవాడకు చెందిన రియల్టర్ కోటేశ్వరరావు ఓ స్థలం కొనుగోలు విషయంపై మరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వెంకటేశ్వర్లను కలిశాడు. అనంతరం ఇద్దరు కలిసి నగర శివారులోని ఓ స్థలాన్ని ఇవాళ పరిశీలించేందుకు వెళ్లారు.

సరిగ్గా అదే సమయంలో పోలీస్ సైరన్ మోగుతూ ఓ వాహనం వచ్చింది. అందులో నుంచి దిగిన దుండగులు నాగేశ్వరరావు వద్ద ఉన్న రూ.20 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇటీవల ఓ భూమి అమ్మగా వచ్చిన రూ.50 లక్షల నగదులో రూ.20 లక్షలతో మరో భూమిని కొనుగోలు చేసేందుకు తాను వచ్చానని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. ఆ తర్వాత స్థానిక పోలీసుస్టేషన్‌కు జరిగిందంతా వివరించాడు. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దొంగతనం విషయంలో కొన్ని అనుమానాలు ఉండటంతో బాధితుడు నాగేశ్వరరావుతో పాటు బ్రోకర్ వెంకటేశ్వరరావును కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం అసలు నిందితులు ఎవరో వెల్లడిస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News