అవును.. నిజంగానే మహిళ సంఘం డబ్బులు దొబ్బేశారు : ఏపీడీ

దిశ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన పూజ గ్రామైక్య సంఘంతో పాటు మరో 21 మహిళా గ్రూపుల డబ్బులు దోచేసినట్లు ఏపీడీ విచారణలో వెల్లడైంది. ఏపీయంసీసీ, సీఏలు ముగ్గురూ కుమ్మక్కై మహిళా సంఘం డబ్బులను కాజేసినట్లు వరంగల్ జిల్లా ఏపీడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణలో వెల్లడైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహిళా సంఘం డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ నల్లబెల్లిలోని మహిళ సంఘం భవన్‌ను బాధిత మహిళలు గత […]

Update: 2021-11-12 08:23 GMT

దిశ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన పూజ గ్రామైక్య సంఘంతో పాటు మరో 21 మహిళా గ్రూపుల డబ్బులు దోచేసినట్లు ఏపీడీ విచారణలో వెల్లడైంది. ఏపీయంసీసీ, సీఏలు ముగ్గురూ కుమ్మక్కై మహిళా సంఘం డబ్బులను కాజేసినట్లు వరంగల్ జిల్లా ఏపీడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణలో వెల్లడైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహిళా సంఘం డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ నల్లబెల్లిలోని మహిళ సంఘం భవన్‌ను బాధిత మహిళలు గత మంగళవారం ముట్టడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గొల్లపల్లె గ్రామంలో సుమారు 500 మంది మహిళా సభ్యుల సమక్షంలో జిల్లా డీఆర్‌డీఏ నుంచి ఏపీడీ శ్రీనివాస్, డీపీహెచ్ఐబీ దయాకర్, సీబీఓ ఆడిటర్ వెంకట్ పర్యవేక్షణలో శుక్రవారం బహిరంగ విచారణ చేపట్టారు. ఏపీఎం, సీసీ, సీఏలు కుమ్మక్కై రూ.10 లక్షలు అవినీతికి పాల్పడినట్టు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. సీఏ మహిపాల్‌ను వెంటనే విధుల నుండి తప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీఎం సునీత, సీసీ పద్మలపై సమగ్ర విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఏపీడి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసు పులమ్మ, మహిళ మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి, గ్రామ మహిళా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News