రూ.100 కోట్ల హెరాయిన్ సీజ్.. ఇద్దరి అరెస్టు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు స్మగ్లర్స్ గుట్టుచప్పుడు కాకుండా తమ పనిని చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల కాలంలో ఇండియాలోని ఎయిర్ పోర్టులే ప్రధాన కేంద్రంగా జోరుగా గోల్డ్, డ్రగ్స్ దందా నడుస్తోంది. కస్టమ్స్ తనిఖీల్లో చాలా కేసులు వెలుగుచూస్తున్న ఈ దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా చెన్నై పోర్టు గుండా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 15.6కేజీల హెరాయిన్ ను సీజ్ చేయగా […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు స్మగ్లర్స్ గుట్టుచప్పుడు కాకుండా తమ పనిని చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల కాలంలో ఇండియాలోని ఎయిర్ పోర్టులే ప్రధాన కేంద్రంగా జోరుగా గోల్డ్, డ్రగ్స్ దందా నడుస్తోంది.
కస్టమ్స్ తనిఖీల్లో చాలా కేసులు వెలుగుచూస్తున్న ఈ దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా చెన్నై పోర్టు గుండా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 15.6కేజీల హెరాయిన్ ను సీజ్ చేయగా దాని విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హెరాయిన్ తీసుకొచ్చిన నిందితులు టాంజానియా దేశానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.