కిన్నెరసానికి రాకపోకలు బంద్

దిశ, కొత్తగూడెం: గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుడటంతో కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. కిన్నెరసాని ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 405 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో పాల్వంచ మండలం రంగాపురం వద్ద వరద నీటికి బ్రిడ్జి కోతకు గురవడంతో అధికారులు రాకపోకలు బంద్ చేశారు. ఘటనా స్థలాన్ని అడిషనల్‌ ఎస్పీ తిరుపతి, డీఎస్పీ కెఆర్‌కె ప్రసాద్, […]

Update: 2020-08-15 10:03 GMT

దిశ, కొత్తగూడెం: గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుడటంతో కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. కిన్నెరసాని ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 405 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో పాల్వంచ మండలం రంగాపురం వద్ద వరద నీటికి బ్రిడ్జి కోతకు గురవడంతో అధికారులు రాకపోకలు బంద్ చేశారు. ఘటనా స్థలాన్ని అడిషనల్‌ ఎస్పీ తిరుపతి, డీఎస్పీ కెఆర్‌కె ప్రసాద్, పాల్వంచ సీఐ పరిశీలించారు.

Tags:    

Similar News