సూర్య నిరాశలో కూరుకుపోయాడు : రోహిత్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంఅందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్‌ పేరు లేకపోవడాన్ని హర్భజన్ సింగ్, మనోజ్ తివారీ, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి వారు తప్పుబట్టారు. సెలక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా అభిమానుల నుంచి భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా దీనిపై టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ… ‘సూర్యకుమార్ యాదవ్‌కు సరైన […]

Update: 2020-11-22 01:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంఅందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్‌ పేరు లేకపోవడాన్ని హర్భజన్ సింగ్, మనోజ్ తివారీ, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి వారు తప్పుబట్టారు. సెలక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా అభిమానుల నుంచి భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా దీనిపై టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ… ‘సూర్యకుమార్ యాదవ్‌కు సరైన సమయం వస్తుంది. జట్టుకు ఎంపిక కాని రోజు అతడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. నేను కూడా అతడితో మాట్లాడలేదు. అతనే నా దగ్గరకు వచ్చి… నువ్వేమి బాధపడొద్దు అని ముంబై గెలుపు కోసం ఆడతా అని ధైర్యం చెప్పాడు. బాధ నుంచి భయపడి ముంబై గెలుపు కోసం ఆడతా అని అన్నారు. అప్పుడు సూర్య సరైన మార్గంలోనే పయనిస్తున్నాడని అనిపిచింది. అని రోహిత్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News