'జొమాటో'కు అండగా రోహిత్ శర్మ!

దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికే 1200 దాటింది. అంతే కాకుండా ప్రతీ రోజు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి అందరూ తమ వంతు సాయం అందించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు టీమ్ ఇండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రూ. 80 లక్షల విరాళంగా అందించాడు. రూ. 45 లక్షలు ప్రధాన మంత్రి సహాయ నిధికి, రూ. 25 లక్షలు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ […]

Update: 2020-03-31 04:53 GMT

దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికే 1200 దాటింది. అంతే కాకుండా ప్రతీ రోజు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి అందరూ తమ వంతు సాయం అందించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు టీమ్ ఇండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రూ. 80 లక్షల విరాళంగా అందించాడు. రూ. 45 లక్షలు ప్రధాన మంత్రి సహాయ నిధికి, రూ. 25 లక్షలు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నట్లు తెలిపాడు.
అంతేకాకుండా ‘జొమాటో ఫీడింగ్ ఇండియా’కు రూ.5 లక్షలు అందిస్తున్నట్లు స్పష్టం చేశాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎన్నో కుటుంబాలు తిండి లేక పస్తులుంటున్నాయని.. అటువంటి వారికి ఆహారం అందిస్తోన్న జొమాటో సంస్థకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు రోహిత్ చెప్పారు. ఇక మరో 5 లక్షల రూపాయలను వీధి కుక్కల సంక్షేమానికి కేటాయించినట్లు వెల్లడించాడు.

Tags: Rohit sharma, vice captaian, Donation, Zomato, CMRF, Corona

Tags:    

Similar News