ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు కర్ణాటకకు చెందిన రాజు అనే వ్యక్తిగా గుర్తించారు. ఉపాధి కోసం ఇద్దరు యువకులు కర్ణాటక నుంచి జన్వాడకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-12-14 22:21 GMT

Tags:    

Similar News