జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. విధుల్లో ఉన్న హోంగార్డును ఢీకొట్టి వెళ్లిన లారీ

దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో విధుల్లో ఉన్న హోంగార్డును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోన్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఏఎంవీఐ హరేంద్రకుమార్, నలుగురు హోంగార్డులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ లారీ అతివేగంతో వస్తుండటాన్ని గమనించి ఆపే ప్రయత్నం చేశారు. […]

Update: 2021-11-16 08:15 GMT

దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో విధుల్లో ఉన్న హోంగార్డును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోన్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఏఎంవీఐ హరేంద్రకుమార్, నలుగురు హోంగార్డులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ లారీ అతివేగంతో వస్తుండటాన్ని గమనించి ఆపే ప్రయత్నం చేశారు. పోలీసులను గమనించిన లారీ డ్రైవర్ వేగం పెంచి అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు వై.సత్యనారాయణను ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో హోంగార్డుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఏఎంవీఐ వెంటనే ఆ వాహనాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ సీఐ రాం నర్సింహారెడ్డి, అన్ని చెక్ పోస్టులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News