వరుసగా ఢీకొన్న మూడు కార్లు.. 14 మంది దుర్మరణం, మృతుల్లో 8 మంది చిన్నారులు
దిశ,వెబ్‌డెస్క్: సాఫీగా సాగాల్సిన ప్రయాణాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. రయ్ మని దూసుసుపోయే వాహనాలు, మృత్యుశకటాలుగా మారుతున్నాయి. స్వీయ తప్పిదాలో, సాంకేతికలోపాలో కానీ, ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.కుటుంబాలకు తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా ఇరాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం పాలయ్యారు. ఇరాన్ జాహెదన్ నగరం సిస్టాన్ అనే ప్రాంతంలో మూడుకార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11మంది తీవ్రంగా గాయపడగా, 14మంది మరణించారు. మృతుల్లో 8మంది చిన్నారులున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం […]
దిశ,వెబ్‌డెస్క్: సాఫీగా సాగాల్సిన ప్రయాణాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. రయ్ మని దూసుసుపోయే వాహనాలు, మృత్యుశకటాలుగా మారుతున్నాయి. స్వీయ తప్పిదాలో, సాంకేతికలోపాలో కానీ, ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.కుటుంబాలకు తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నారు.
తాజాగా ఇరాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం పాలయ్యారు. ఇరాన్ జాహెదన్ నగరం సిస్టాన్ అనే ప్రాంతంలో మూడుకార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11మంది తీవ్రంగా గాయపడగా, 14మంది మరణించారు. మృతుల్లో 8మంది చిన్నారులున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం పై అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.