ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అధికారుల పరిస్థితి విషమం..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని 167వ జాతీయ రహదారి అప్పాయిపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఇద్దరు దేవరకద్ర మండల ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులుగా గుర్తించారు. దేవరకద్ర నుండి మహబూబ్ నగర్ వైపు వస్తున్న ఆటో ఐదుగురు ప్రయాణికులను తీసుకొని వస్తుండగా, మహబూబ్ నగర్ నుండి రైచూర్ వైపు వేగంగా వెళుతున్న కారు […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని 167వ జాతీయ రహదారి అప్పాయిపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఇద్దరు దేవరకద్ర మండల ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులుగా గుర్తించారు. దేవరకద్ర నుండి మహబూబ్ నగర్ వైపు వస్తున్న ఆటో ఐదుగురు ప్రయాణికులను తీసుకొని వస్తుండగా, మహబూబ్ నగర్ నుండి రైచూర్ వైపు వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ జ్యోతి(45), ఆటో డ్రైవర్ శేఖర్ రెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందగా ఎంపీడీఓ కార్యాలయానికి చెందిన మరో ఇద్దరు ఉద్యోగులు విజయ రాణి(40), కాజా, మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా విజయ రాణి మరణించింది. తీవ్రంగా గాయపడ్డ శ్రీలతను హైదరాబాదుకు తరలించారు. కారు లో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.
సంఘటన జరిగిన వెంటనే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజు గౌడ్, దేవరకద్ర మండల నేతలు, పలువురు అధికారులు, సిబ్బంది. మృతుల కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పరిస్థితిని గుర్తించి గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అది కూడా నీకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఎంపీ మన్యం శ్రీనివాస్ రెడ్డి సైతం ఆస్పత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను ఓదార్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.