లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి పామూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు చీకటీగలపాలెం రాగానే ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.