ఆర్జే కాజల్.. అమేజింగ్ రివ్యూ
దిశ, వెబ్‌డెస్క్: సమీక్ష చేయడం అనేది ఒక కళ. అది సినిమా అయినా, సీరియల్ అయినా, ప్రోగ్రామ్ అయినా, పుస్తకం అయినా.. సమీక్షించడం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందులోనూ బిగ్‌బాస్ లాంటి కార్యక్రమాన్ని రివ్యూ చేయడం అంటే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అందులో పాల్గొన్న కంటెస్టంట్‌ల మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఎవరి గేమ్ వారే ఆడతారు కాబట్టి రివ్యూ చేసే వారు కంటెస్టంట్‌ల మానసిక పరిస్థితిని, […]
దిశ, వెబ్‌డెస్క్: సమీక్ష చేయడం అనేది ఒక కళ. అది సినిమా అయినా, సీరియల్ అయినా, ప్రోగ్రామ్ అయినా, పుస్తకం అయినా.. సమీక్షించడం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందులోనూ బిగ్‌బాస్ లాంటి కార్యక్రమాన్ని రివ్యూ చేయడం అంటే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అందులో పాల్గొన్న కంటెస్టంట్‌ల మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఎవరి గేమ్ వారే ఆడతారు కాబట్టి రివ్యూ చేసే వారు కంటెస్టంట్‌ల మానసిక పరిస్థితిని, వారి గేమ్ విధానాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కరికి ఫేవర్‌గా లేదా వ్యతిరేకంగా సమీక్షించినా అభిమానులతో పోరు పడాల్సి వస్తుంది. అందుకే కంటెస్టంట్‌లకు ఫేవర్‌గా కాకుండా జనాల మనసుల్లో నిజాయితీగా అనుకుంటున్న మాటలను రివ్యూలో చెప్పగలగాలి. ఇప్పుడు అచ్చం అలాంటి పనినే ఆర్జే కాజల్ చేస్తోంది.మొదటి నుంచి కంటెస్టంట్‌లు పరిచయం లేని వాళ్లనే టాక్ ఉన్నప్పటికీ.. రేటింగ్‌లు మాత్రం అదిరిపోతున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, సేఫ్ గేమ్ స్ట్రాటజీలు, అలకలు, ఏడుపులు, గాసిప్‌లు.. ఇలా అన్నింటినీ రివ్యూ చేయాలంటే కనీసం పది నిమిషాల వీడియో చేయాలి. కానీ ఆర్జే కాజల్ మాత్రం అరనిమిషం నుంచి మూడు నిమిషాల్లో ప్రతి ఎపిసోడ్‌ను రివ్యూ చేస్తుంది. అదేదో ఆమె ఫ్రేమ్‌లో నిలబడి రివ్యూ చేస్తే ప్రేక్షకులకు అంతగా చేరదు కాబట్టి చాలా తెలివిగా ఆలోచించి రివ్యూ వీడియోలను పెడుతోంది. ఈ రివ్యూ వీడియోలకు తన బెస్ట్‌ఫ్రెండ్ ఆర్జే చైతూ కూడా తన వంతు సాయం చేస్తున్నాడనుకోండి. కానీ చెప్పాల్సింది చెప్పాల్సిన విధంగా చెబుతున్న క్రెడిట్ మాత్రం ఆర్జే కాజల్‌కే దక్కుతుంది. అందుకే ఆమె వీడియోలు ఇంత పాపులర్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె వీడియోల్లో ఏం ఉంటుందంటే..
ఈసారి గంగవ్వ కారణంగా ఇంట్లో పెద్దవాళ్లు కూడా బిగ్‌బాస్ చూస్తున్నారు. ఇక యువతకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి అఖిల్, సోహైల్, మోనల్, హారిక ఉన్నారు. డ్యాన్స్ ప్రియులకు, హాస్య ప్రియుల కోసం అమ్మ రాజశేఖర్, మొహబూబ్, జబర్దస్త్ అవినాష్ ఉన్నారు. కాబట్టి ఆయా వయస్సులకు చెందిన అభిమానులు వారికి నచ్చిన కంటెస్టంట్‌లకు ఫేవర్‌గా ఉంటారు. అందుకే అందరికీ రీచ్ అయ్యేవిధంగా ఆర్జే కాజల్ ఒక కుటుంబ నేపథ్యాన్ని తన రివ్యూలకు వారధిగా ఎంచుకుంది. ఒక ఇంట్లో ఉన్న అత్తగారు, కోడలు, కూతురు, కొడుకు, భర్త.. ఇలా ఎవరి అభిరుచికి తగిన కంటెస్టంట్‌ను వారు సపోర్ట్ చేస్తూ వాదించుకుంటూ ఆర్జే కాజల్ రివ్యూ చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఏ కంటెస్టంట్‌కు ఫేవర్‌గా కాకుండా ఎపిసోడ్ సమ్మరీ సరిగా అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు ఆమె వీడియోలకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈ లెక్కన చూస్తే బిగ్‌బాస్ అయిపోయే నాటికి ఆర్జే కాజల్ బిగ్‌బాస్ గురూగా మారిపోయే అవకాశం కూడా ఉంది. ఎనీ వే ఆల్ ద బెస్ట్ ఆర్జే కాజల్!