‘రియా బెయిలును రద్దు చేయాలి’

దిశ,వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బెయిలును రద్దు చేయాలంటూ తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను ఎల్లుండి విచారిస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే ఈ కేసులో కొంత కాలం పాటు […]

Update: 2021-03-15 21:26 GMT

దిశ,వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బెయిలును రద్దు చేయాలంటూ తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను ఎల్లుండి విచారిస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే ఈ కేసులో కొంత కాలం పాటు జైలులో ఉన్న రియా బాంబే హైకోర్టు గతేడాది అక్టోబరు 7న లక్షరూపాయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని రియాకు ఆంక్షలు విధించింది తెలిసిందే.

Tags:    

Similar News