భారీగా పెరిగిన తెల్ల బంగారం ధరలు
దిశ, కుబీర్: గత నెలలో పత్తి ధరలు నెల చూపులు చూశాయి. రోజురోజుకు ధరలు పతనం కావడంతో రైతులు పత్తిని విక్రయించడానికి వెనుకంజ వేశారు. ఈ క్రమంలో నాలుగైదు రోజులుగా పత్తి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం కుబీర్ మార్కెట్లో క్వింటా పత్తి రూ.8550 పలకగా, భైంసా మార్కెట్‌లో క్వింటాకు రూ.8650 పలికింది. పతనమైన ధరల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో పత్తి ధరలు మరింత పెరుగుతున్నాయి. కాగా, ఈయేడు అతివృష్టి […]
దిశ, కుబీర్: గత నెలలో పత్తి ధరలు నెల చూపులు చూశాయి. రోజురోజుకు ధరలు పతనం కావడంతో రైతులు పత్తిని విక్రయించడానికి వెనుకంజ వేశారు. ఈ క్రమంలో నాలుగైదు రోజులుగా పత్తి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం కుబీర్ మార్కెట్లో క్వింటా పత్తి రూ.8550 పలకగా, భైంసా మార్కెట్‌లో క్వింటాకు రూ.8650 పలికింది. పతనమైన ధరల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మహారాష్ట్రలో పత్తి ధరలు మరింత పెరుగుతున్నాయి. కాగా, ఈయేడు అతివృష్టి వల్ల దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సహజంగా ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం రెండు, మూడు క్వింటాళ్ల దాటని పరిస్థితి నెలకొంది. ధరల్లో పెరుగుదల కనిపిస్తోన్న ఫ్యాక్టరీలలో ఆశించిన స్థాయిలో పత్తి నిల్వలు లేక వెలవెలబోతున్నాయి.