హుజూరాబాద్ బై పోల్.. నేతల‌పై పెరుగుతున్న కేసులు

దిశ, వెబ్‌డెస్క్ : హుజూరాబాద్‌లో రాజకీయ వేడి రాజుకుంది. ఉపఎన్నికలలో నువ్వా నేనా అనే విధంగా పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలు సభలు సమావేశాలు కూడా ఎక్కువగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభలు సమావేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించక పోయే సరికి నియోజకవర్గ ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. రాజకీయ పార్టీల ప్రచారంతో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో 374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం […]

Update: 2021-07-13 20:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హుజూరాబాద్‌లో రాజకీయ వేడి రాజుకుంది. ఉపఎన్నికలలో నువ్వా నేనా అనే విధంగా పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలు సభలు సమావేశాలు కూడా ఎక్కువగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభలు సమావేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించక పోయే సరికి నియోజకవర్గ ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. రాజకీయ పార్టీల ప్రచారంతో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో 374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 246 కేసులు హుజూరాబాద్ మండలంలోనే నమోదయ్యే సరికి అప్రమత్తమైన ఆరోగ్య శాఖ, థర్డ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు కొవిడ్ నిబంధనలను పక్కకు పెట్టి ప్రచారాన్ని కొనసాగిస్తుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ఓ కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇక పెరుగుతున్న పాజిటివ్ కేసులతో హుజూరాబాద్ ప్రజలే కాదు ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చే నేతలు కూడా వణికి పోతున్నారు.

Tags:    

Similar News