మహిళలు అలాంటి దుస్తులు వేసుకోవడం వల్లే వారిపై దాడులు..
దిశ, వెబ్ డెస్క్ : మహిళలు రిప్పుడ్ జీన్స్ ధరించడంపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. తీరత్ సింగ్ మాటాలకు మద్దుతు తెలుపుతూ.. మధ్యప్రదేశ్ బీజేపీ నేత, రైతుల సంక్షేమ, వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇటువంటి దుస్తులను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మన సంస్కృతిని కాపాడటం మన కర్తవ్యం. మన గౌరవాన్ని కాపాడుకోవాలి. మా సంస్కృతి […]
దిశ, వెబ్ డెస్క్ : మహిళలు రిప్పుడ్ జీన్స్ ధరించడంపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. తీరత్ సింగ్ మాటాలకు మద్దుతు తెలుపుతూ.. మధ్యప్రదేశ్ బీజేపీ నేత, రైతుల సంక్షేమ, వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇటువంటి దుస్తులను నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మన సంస్కృతిని కాపాడటం మన కర్తవ్యం. మన గౌరవాన్ని కాపాడుకోవాలి. మా సంస్కృతి ఎప్పుడూ చిరిగిన, పొట్టి దుస్తులను ప్రోత్సహించలేదు. మన సంస్కృతిలో, మహిళలు సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించేవారు. విదేశీ సంస్కృతిని అనుసరించడం ద్వారా ప్రజలు మన స్వంత సంస్కృతిని పాడు చేస్తున్నారు ” అని అన్నారు.
యువతులు, మహిళలు ఇలాంటి దుస్తులు ధరించకుండా వారి తల్లిదండ్రులే తగిన విధంగా వారికి చెప్పాలని ఆయన కోరారు. ఇటువంటి దుస్తులు వేసుకోవడం వల్లే మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.