భైంసాలో అర్ధరాత్రి అలజడి

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రాత్రి ఒక ప్రార్థన మందిరం వద్ద వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ప్రార్థన మందిరం వద్ద గుమిగూడారు. ఈ నేపథ్యంలో వారిని మరో వర్గానికి చెందిన ఓ వ్యక్తి ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం […]

Update: 2020-05-10 22:51 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రాత్రి ఒక ప్రార్థన మందిరం వద్ద వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ప్రార్థన మందిరం వద్ద గుమిగూడారు. ఈ నేపథ్యంలో వారిని మరో వర్గానికి చెందిన ఓ వ్యక్తి ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు రాత్రి రాత్రికే బైంసా చేరుకున్నారు. అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఆరా తీశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం భైంసాలో వివాదం అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News