ఏప్రిల్ మొదటి వారంలోనే ధాన్యం కొనుగోళ్లు ..

దిశ, కరీంనగర్: ఏప్రిల్ మొదటి వారంలోనే టోకెన్ పద్దతి ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో కరోనా నివారణ చర్యలపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో పారిశుద్దంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారి […]

Update: 2020-03-30 06:12 GMT

దిశ, కరీంనగర్: ఏప్రిల్ మొదటి వారంలోనే టోకెన్ పద్దతి ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో కరోనా నివారణ చర్యలపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో పారిశుద్దంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారి గురించి ప్రజలు సమీపంలోని అధికారులకు సమాచారం ఇస్తే వారిని చికిత్స కోసం వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తమన్నారు. కూరగాయలు అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు ఆర్టీసీ బస్ స్టేషన్లలో మార్కెట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నిత్యావసరాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. లాక్ డౌన్‌ సమయంలో బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కలెక్టర్ రవి, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, కోరుట్ల శాసన సభ్యులు విద్యాసాగర్ రావులు ఉన్నారు.

Tags : april 1st week, rice marketing, minister koppula eshwar, corona control

Tags:    

Similar News