రాజమౌళికి వర్మ బిజినెస్ టిప్స్..

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రతీ విషయంలో కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కరోనా కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోగా, సినిమా షూటింగ్స్ లేక తారలంతా ఇంటి పట్టునే ఉంటే.. తను మాత్రం లాక్‌డౌన్ సమయంలో సినిమా తీసి రిలీజ్ చేశాడు. థియేటర్స్ టైమింగ్ పెట్టి సగటు ప్రేక్షకుడు రూ. 100 పెట్టి టికెట్ కొంటేనే సినిమా చూసేలా ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ప్లాన్‌తో వచ్చాడు. ఫస్ట్ సినిమా క్లిక్ కాగానే టికెట్ ధరను ఏకంగా రూ. 200కు పెంచి మంచి […]

Update: 2020-07-20 05:11 GMT

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రతీ విషయంలో కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కరోనా కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోగా, సినిమా షూటింగ్స్ లేక తారలంతా ఇంటి పట్టునే ఉంటే.. తను మాత్రం లాక్‌డౌన్ సమయంలో సినిమా తీసి రిలీజ్ చేశాడు. థియేటర్స్ టైమింగ్ పెట్టి సగటు ప్రేక్షకుడు రూ. 100 పెట్టి టికెట్ కొంటేనే సినిమా చూసేలా ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ప్లాన్‌తో వచ్చాడు. ఫస్ట్ సినిమా క్లిక్ కాగానే టికెట్ ధరను ఏకంగా రూ. 200కు పెంచి మంచి బిజినెస్ చేసిన వర్మ.. ప్రస్తుతం మరో కొత్త ఐడియాతో వచ్చేశాడు.

2019 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ కథను పవర్‌స్టార్ పేరుతో తెరకెక్కిస్తున్న వర్మ.. ఇందుకు పవన్ ఫాలోయింగ్‌ను కూడా మంచి బిజినెస్ ఫార్ములాగా మార్చేశాడు. పవన్ గురించి సినిమా అంటే జనాల్లో ఆసక్తి పెరుగుతుంది కాబట్టి.. సినిమాకి మాత్రమే డబ్బులు ఎందుకు వసూల్ చేయాలి.. సినిమా ట్రైలర్‌కు కూడా మనీ వసూల్ చేయొచ్చనే కొత్త ఆలోచనతో వచ్చాడు. ఈ విషయాన్ని ప్రకటించిన వర్మ, పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేశాక.. భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ పవర్ స్టార్ ట్రైలర్‌ను భారీ సంఖ్యలో చూడటంతో పవర్‌స్టార్ పేరిట కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు వర్మ.

ఐతే.. ఇదే బిజినెస్ టిప్ ఫాలో అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా మార్కెట్‌లో మంచి బిజినెస్ చేస్తుందని జక్కన్నకు సలహా ఇస్తున్నారు వర్మ. ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్‌ను చూడాలంటే రూ.150 – రూ. 200 వరకు చెల్లించాలనే కాన్సెప్ట్‌తో రాజమౌళి ముందుకొస్తే నిర్మాతకు లాభాల పంట పండుతుందని చెప్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమా మీద పెట్టిన డబ్బులు ట్రైలర్ ద్వారానే తిరిగి పొందవచ్చని అంటున్నాడు.

Tags:    

Similar News