Revanth Reddy:నిర్మల్‌లో రేవంత్ రెడ్డి పర్యటన..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నిర్మల్ జిల్లా గంజాల్ టోల్గేట్ వద్ద ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయన కొండాపూర్ బైపాస్ కు చేరుకున్నారు. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీగా బయలుదేరారు. ఓపెన్ […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నిర్మల్ జిల్లా గంజాల్ టోల్గేట్ వద్ద ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయన కొండాపూర్ బైపాస్ కు చేరుకున్నారు. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీగా బయలుదేరారు. ఓపెన్ టాప్ జీపుపై బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, డీసీపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్.. కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ పార్కకు చేరుకున్నారు. అనంతరం కొండాపూర్ బైపాస్ నుంచి మంచిర్యాల రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.