బత్తాయి, నిమ్మ రైతులతో మంత్రులు సమీక్ష
దిశ, రంగారెడ్డి: ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి ఆరోగ్య ప్రదాయని అని మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దానికి తోడు నిమ్మ ఉంటే మనిషి శరీరంలోకి అవసరమైన సి విటమిన్ లభిస్తుందన్నారు. ఎల్బీనగర్‌లో బత్తాయి, నిమ్మ రైతులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గూడ్స్ ఏర్పాటు చేసినందున.. ఇక్కడి రైతాంగం ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు మంత్రులు […]
దిశ, రంగారెడ్డి: ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి ఆరోగ్య ప్రదాయని అని మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దానికి తోడు నిమ్మ ఉంటే మనిషి శరీరంలోకి అవసరమైన సి విటమిన్ లభిస్తుందన్నారు. ఎల్బీనగర్‌లో బత్తాయి, నిమ్మ రైతులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గూడ్స్ ఏర్పాటు చేసినందున.. ఇక్కడి రైతాంగం ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఏపీ గెస్ట్‌హౌస్‌లో బత్తాయి రైతులకు ఉచితంగా వసతి సౌకర్యం కల్పించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అదే సమయంలో రైతులు తాము పండించిన పంటను తొందరపడి తెంపొద్దని మే 3 లాక్ డౌన్ పూర్తి కాగానే పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన రైతులు హాజరయ్యారు.
Tags:Ministers Review, niranjan reddy, jagadish reddy, sabitha indra reddy, orange and Lemon Farmers, LB nagar