ఈనెల 27న నిర్మల్‌కు రేవంత్
దిశ, ఆదిలాబాద్: ఈ నెల 27న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి నిర్మల్ పర్యటనకు వస్తున్నట్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం, మక్కలు కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు, రైస్‌మిల్ యజమానులతో మంత్రి ఇంద్రకరణ్ […]
దిశ, ఆదిలాబాద్: ఈ నెల 27న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి నిర్మల్ పర్యటనకు వస్తున్నట్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం, మక్కలు కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు, రైస్‌మిల్ యజమానులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుమ్మక్కయ్యారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కరోనా విరాళాల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు పొందేందుకు నిర్మల్ ప్రజల నుంచి కోటి రూపాయలు ముక్కు పిండి వసూలు చేశారన్నారు.