సీఎస్ ను సస్పెండ్ చేయాలి : రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర పరిపాలనతోపాటు, సీఎం కేసీఆర్ తీరు, అధికారుల వ్యవహారశైలిపై ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. సీఎం ఇవ్వేం పట్టనట్లు ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహిస్తే చీఫ్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి హాజరు కాకపోవడంపై అసహానం వ్యక్తం చేశారు. వెంటనే వారిద్దరిని విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ […]
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర పరిపాలనతోపాటు, సీఎం కేసీఆర్ తీరు, అధికారుల వ్యవహారశైలిపై ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. సీఎం ఇవ్వేం పట్టనట్లు ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహిస్తే చీఫ్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి హాజరు కాకపోవడంపై అసహానం వ్యక్తం చేశారు. వెంటనే వారిద్దరిని విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని రేవంత్ మండిపడ్డారు.
హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాపిస్తునందున వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని విధించాలని కోరారు. కరోనా కట్టడి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దాతలు ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని అన్నారు.
దేశంలోనే ‘వేర్ ఈజ్ కేసీఆర్’ అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉందని, వెంటనే ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రానున్న 6 నెలల పాటు ఫాంహౌస్ నుంచే కేసీఆర్ పాలనను నిర్వహిస్తారనే వార్తలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని, సీఎం పర్యవేక్షణ లేని పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని రేవంత్ చెప్పారు. వెంటనే సెక్షన్ 8ని గవర్నర్ ఉపయోగించాలని కోరారు.