హోం క్వారంటైన్లో రేసుగుర్రం విలన్
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ ప్రస్తుతం అలావైకుంఠపురంలో సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ, లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇందియా మూవీ పుష్ప కోసం సిద్ధం అవుతున్నాడు. అయితే అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో నాయకుడి పాత్రకు దీటుగా ఉండే విలన్ ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రను భోజ్పురి స్టార్ రవికిషన్ పోషించారు. ఆ […]
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ ప్రస్తుతం అలావైకుంఠపురంలో సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ, లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇందియా మూవీ పుష్ప కోసం సిద్ధం అవుతున్నాడు. అయితే అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో నాయకుడి పాత్రకు దీటుగా ఉండే విలన్ ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రను భోజ్పురి స్టార్ రవికిషన్ పోషించారు. ఆ తర్వాత దక్షిణాదిన టాప్ విలన్లలో ఒకరిగా ఆయన దూసుకుపోతున్నారు. మరోవైపు, బీజేపీ ఎంపీగా కూడా ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన ఇంట్లో కూడా కరోనా కలకలం రేపింది.
తన పీఏ గుడ్డూ పాండే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారని, కరోనా పరీక్షలు చేయించగా, ఆయనకు పాజిటివ్ అని తేలిందని రవికిషన్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారని చెప్పారు. తన పీఏ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. మరోవైపు, పీఏకు కరోనా పాజిటివ్ అని తెలియగానే రవికిషన్ హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు.