శ్రీవారి కళ్యాణోత్సవ ఆన్‌లైన్ టికెట్లపై ఆంక్షలు
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవ ఆన్‌లైన్ టికెట్ల కోటాపై టీటీడీ సీలింగ్ విధించింది. 16 నుంచి నవరాత్రి ఉత్సవాలు కావడంతో కళ్యాణోత్సవ సేవను 10రోజుల పాటు రద్దు చేసింది. తిరిగి 26నుంచి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. అక్టోబర్ 3న రికార్డ్ స్థాయిలో 4,300 టిక్కెట్లను కొనుగోలు చేశారు. గత శని, ఆదివారాల్లో కళ్యాణోత్సవ సేవా […]
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవ ఆన్‌లైన్ టికెట్ల కోటాపై టీటీడీ సీలింగ్ విధించింది. 16 నుంచి నవరాత్రి ఉత్సవాలు కావడంతో కళ్యాణోత్సవ సేవను 10రోజుల పాటు రద్దు చేసింది. తిరిగి 26నుంచి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. అక్టోబర్ 3న రికార్డ్ స్థాయిలో 4,300 టిక్కెట్లను కొనుగోలు చేశారు. గత శని, ఆదివారాల్లో కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లపై 16వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే భక్తుల సంఖ్య పెరగడంతో రోజుకు 1000 కళ్యాణోత్సవ టిక్కెట్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది. ఈనెల 15వరకు టిక్కెట్ల విక్రయాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి.