MLA Kalva Srinivasulu: వైసీపీ పాలనలో సాగునీటి రంగం సర్వనాశనమైంది.. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఫైర్

వైసీపీ (YCP) పాలనలో సాగునీటి రంగం పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-16 06:59 GMT
MLA Kalva Srinivasulu: వైసీపీ పాలనలో సాగునీటి రంగం సర్వనాశనమైంది.. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఫైర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) పాలనలో సాగునీటి రంగం పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ (Budget)లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు (MLA Kalva Srinivasulu) మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ (Jagan) పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుంటుబడ్డాయని ఆరోపించారు. ముఖ్యంగా రాయలసీమ (Rayalaseema) సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును అంధకారం చేశారని ఫైర్ అయ్యారు.

గత ఐదేళ్లలో రాయలసీమ (Rayalaseema) ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా తయారైందని కామెంట్ చేశారు. ప్రాజెక్టుల పురోగతి లేకుండా వివాదాస్పదంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ప్రాజెక్టులకు కృష్ణా మిగులు జలాలు అడగమని అంటే.. బచావత్ ట్రిబ్యునల్‌ (Bachawat Tribunal)కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) మరణశాసనం లాంటి లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు (Pothireddypadu) సామర్థ్యం పెంచుతున్నామంటూ జగన్ (Jagan) ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. రూ.63 వేల కోట్లతో రాయలసీమ (Rayalaseema) కరువు నివారణ పథకాన్ని తీసుకొస్తామని చెప్పి ఆ నిధులను ఖర్చు చేయకుండా ప్రాజెక్టులను నాశనం చేశారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు.  

Tags:    

Similar News