Tirumala:తిరుమలలో రేపు కార్తీక వనభోజనం.. పటిష్ట ఏర్పాట్లు

కార్తీక వన భోజనం కార్యక్రమం రేపు(ఆదివారం) తిరుమలలో జరుగనున్నది.

Update: 2024-11-16 06:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: కార్తీక వన భోజనం కార్యక్రమం రేపు(ఆదివారం) తిరుమలలో జరుగనున్నది. ఈ క్రమంలో తిరుమలలో రేపు కార్తీక వన భోజన కార్యక్రమం సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) రద్దు చేసింది. వర్ష సూచనల నేపథ్యంలో వన భోజనం నిర్వహణ వేదికను పార్వేట మండపం నుంచి వైభవోత్సవం మండపానికి మార్చినట్లు తెలిపింది. ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకిపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతారు. రేపు ఉదయం 11 గంటలకు గజ వాహనంపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి మలయప్పస్వామి రానున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. కార్తీక వనభోజనం కారణంగా శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News