క్లైమేట్ చేంజెస్ తట్టుకునే ‘సూపర్ పొటాటో’ 

దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పుల వల్ల మానవాళికి, జీవజాతులకే కాక కూరగాయలు, దుంపలకు కూడా నష్టం వాటిల్లుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వెజిటేబుల్స్ నాణ్యతను దెబ్బతీస్తుండటం పలు వ్యాధులకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు క్లైమేట్ ఛేంజెస్‌ తట్టుకోగల బంగాళాదుంపల ఉత్పత్తికి ఉమైనే విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షపాతం సహా వాతావరణంలో చోటుచేసుకునే అనూహ్య మార్పులను బంగాళాదుంపలు తట్టుకోలేవు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగల నిరోధకత కలిగి ఉండే బంగాళదుంప రకాలను […]

Update: 2021-11-30 00:52 GMT

దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పుల వల్ల మానవాళికి, జీవజాతులకే కాక కూరగాయలు, దుంపలకు కూడా నష్టం వాటిల్లుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వెజిటేబుల్స్ నాణ్యతను దెబ్బతీస్తుండటం పలు వ్యాధులకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు క్లైమేట్ ఛేంజెస్‌ తట్టుకోగల బంగాళాదుంపల ఉత్పత్తికి ఉమైనే విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

భారీ వర్షపాతం సహా వాతావరణంలో చోటుచేసుకునే అనూహ్య మార్పులను బంగాళాదుంపలు తట్టుకోలేవు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగల నిరోధకత కలిగి ఉండే బంగాళదుంప రకాలను ఉత్పత్తి చేయడమే మనముందున్న పరిష్కారం. ఇందుకు సంబంధించి అమెరికా గతంలోనే ‘కారిబౌ రసెట్’ రకం బంగాళాదుంపల్ని అభివృద్ధి చేసింది. కానీ వాతావరణ మార్పుల భవిష్యత్ ప్రభావాలను నిరోధించేందుకు కారిబౌ రకం కూడా అవసరమైనంత వేడిని తట్టుకోలేకపోతుందని పరిశోధకులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఉమైనే (UMaine) పరిశోధకులు క్లైమేట్ చేంజ్‌ను తట్టుకునే బంగాళదుంపల్ని పండించారు.

తెగుళ్లను నాశనం చేయడమే కాక పురుగు మందుల అవసరాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం వర్జీనియా, నార్త్ కరోలినా, ఫ్లోరిడాలోని అధిక ఉష్ణోగ్రతలను కొత్త రకం బంగాళాదుంపలు తట్టుకుంటాయా? లేదా అని తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు. సానుకూల ఫలితాలు కనిపిస్తే, వీటిని క్రాస్-పాలినేషన్‌లో అభివృద్ధి చేసేందుకు 10 ఏళ్లు పడుతుందని, వాణిజ్యపరంగా మార్కెట్‌లో విడుదల చేసేందుకు రెండు నుంచి ఐదేళ్లు పట్టవచ్చని పరిశోధకులు తెలిపారు.

పంట నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో పరిశోధనలు జరుగుతుండగా.. మొక్కజొన్న, గోధుమ ఉత్పత్తిని వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తున్నాయని తాజాగా ‘నాసా అధ్యయనం’ వెల్లడించింది. దీనివల్ల మొక్కజొన్న దిగుబడి తగ్గుతుందని అంచనా వేసింది. అయితే గోధుమలు మాత్రం వృద్ధిని చూడగలవని పేర్కొంది. 2030 నాటికి అధిక గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల ప్రభావంతో వేడెక్కుతున్న ఉష్గోగ్రతలను తట్టుకునే వెజిటేబుల్స్ పండించుకోవాల్సిన అవసరముందని పరిశోధకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News