తల్లి పాత్రలకు ఓకే : రేణు దేశాయ్

దిశ, వెబ్ డెస్క్: సెలబ్రెటీలంతా తమ అభిమానులతో ఎప్పటికప్పుడు తమ లాక్డౌన్ అనుభవాలను, పాత సినిమా ముచ్చట్లను, తదుపరి ప్రాజెక్టులను పంచుకుంటున్నారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులను సంతోష పెడుతున్నారు. తాజాగా సినీ నటి, దర్శకురాలు రేణుదేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ లైవ్ చాట్ లో ఓ అభిమాని రేణు దేశాయ్ ని ‘మహేష్‌, ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా? ’ […]

Update: 2020-05-03 06:37 GMT

దిశ, వెబ్ డెస్క్: సెలబ్రెటీలంతా తమ అభిమానులతో ఎప్పటికప్పుడు తమ లాక్డౌన్ అనుభవాలను, పాత సినిమా ముచ్చట్లను, తదుపరి ప్రాజెక్టులను పంచుకుంటున్నారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులను సంతోష పెడుతున్నారు. తాజాగా సినీ నటి, దర్శకురాలు రేణుదేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ లైవ్ చాట్ లో ఓ అభిమాని రేణు దేశాయ్ ని ‘మహేష్‌, ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా? ’ అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రేణు తన మనసులో మాటను బయటపెట్టింది. హీరోల చిన్నతనంలోని పాత్రలకు ‘అమ్మ’గా చేయడానికి సిద్ధమేనని చెప్పింది. తనను దర్శకులు ఓల్డ్ లుక్‌లో బాగా చూపింగలరనే నమ్మకం ఉంటే మహేష్‌ బాబు లాంటి హీరోలకు తల్లిగా నటిచేందుకు సిద్ధమేనని రేణు దేశాయ్ చెప్పారు. తను చిన్న పెద్ద అనే తేడా లేదని.. తాము నటులమని ఎలాంటి పాత్ర వచ్చినా పోషించేందుకు సిద్ధంగా ఉండాలని రేణు దేశాయ్ చెప్పింది. మరో నెటిజన్ లవ్, బ్రేకప్ గురించి చెప్పమంటూ అడిగారు. అందుకు రేణూ ‘లవ్ అనే పదం చాలా కాంప్లికేటేడ్. దాని భిన్న రకాల ఉద్దేశాలు, అభిప్రాయాలుంటాయి. ఇది వ్యక్తికి, వ్యక్తికి వేర్వేరుగా ఉంటుంది. స్కూల్లో రకరకాల చరిత్ర గురించి చెబుతారు గానీ భావోద్వేగాలను ఎలా డీల్ చేయాలో మనకు చెప్పరు’ అంటూ సమాధానం చెప్పింది. పాజిటివ్ విషయాలపైన దృష్టిపెట్టాలి. ‘మనకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడాలి. మంచి ఆహారం తీసుకోవాలి. మనకిష్టమైన విషయాలపై దృష్టిపెడితే మెంటల్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది’అని రేణుదేశాయ్ మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

tags: renu desai, tollywood, celebrity, cinema, mahesh babu

Tags:    

Similar News