కరోనా ఎఫెక్ట్ : దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు
దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌పైన కూడా కరోనా దెబ్బ పడింది. ఇప్పటికే ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ తాజాగా సఫారీలతో జరగాల్సిన రెండు వన్డేలను రద్దు చేసింది. గురువారం ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. లక్నో, కోల్‌కతాల్లో జరగాల్సిన మిగిలిన మ్యాచ్‌లనూ కరోనా ఎఫెక్ట్‌తో రద్దు చేశారు. ఈ మేరకు బీసీసీఐ అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం లక్నోలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ చేరుకొని […]
దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌పైన కూడా కరోనా దెబ్బ పడింది. ఇప్పటికే ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ తాజాగా సఫారీలతో జరగాల్సిన రెండు వన్డేలను రద్దు చేసింది. గురువారం ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. లక్నో, కోల్‌కతాల్లో జరగాల్సిన మిగిలిన మ్యాచ్‌లనూ కరోనా ఎఫెక్ట్‌తో రద్దు చేశారు. ఈ మేరకు బీసీసీఐ అధికారులు మీడియాకు వెల్లడించారు.
ప్రస్తుతం లక్నోలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ చేరుకొని స్వదేశానికి బయలుదేరనుంది. తొలుత ప్రేక్షకులు లేకుండానే రెండు వన్డేలను ఆడించాలని భావించారు. కానీ ఇవాళ బీసీసీఐ అధికారులతో ప్రభుత్వం జరిపిన చర్చల అనంతరం వన్డే సిరీస్ రద్దుకే మొగ్గు చూపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల అనంతరం.. ఐసీసీ క్రీడీ క్యాలెండర్‌ను అనుసరించి ఈ వన్డేలను జరిపే వీలుందని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.
Tags: Oneday Series, South Africa vs India, Coronavirus, cancel, After IPL