తక్కువ ధరలో జియో స్మార్ట్‌ఫోన్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మరో భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రస్తుత ఏడాది డిసెంబర్ నాటికి తక్కువ ధరలో(లో-కాస్ట్) 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)లను విడుదల చేయాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల నివేదికల ప్రకారం.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ (Google Android) ద్వారా తక్కువ ధరతో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయనున్నట్టు, అంతేకాకుండా ఆ స్మార్ట్‌ఫోన్‌లలో డేటా ప్యాక్‌లను సైతం అందించనున్నట్టు సమాచారం. డేటా ప్యాక్‌లతో కూడిన 10 కోట్ల […]

Update: 2020-09-09 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మరో భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రస్తుత ఏడాది డిసెంబర్ నాటికి తక్కువ ధరలో(లో-కాస్ట్) 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)లను విడుదల చేయాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల నివేదికల ప్రకారం.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ (Google Android) ద్వారా తక్కువ ధరతో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయనున్నట్టు, అంతేకాకుండా ఆ స్మార్ట్‌ఫోన్‌లలో డేటా ప్యాక్‌లను సైతం అందించనున్నట్టు సమాచారం.

డేటా ప్యాక్‌లతో కూడిన 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)లను డిసెంబర్ నాటికి లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని రిలయన్స్ సంస్థ భావిస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన 4జీ లేదా 5జీ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్‌తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు, గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నిర్మిస్తుందని ముఖేశ్ అంబానీ ప్రకటించారు. కాగా, గూగుల్ సంస్థ రిలయన్స్ డిజిటల్ విభాగం జియోలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు జులైలో రిలయన్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News