జియో బ్రౌజర్ వచ్చేసింది..

దిశ, వెబ్‌డెస్క్ :  రిలయెన్స్ జియో.. మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. డేటా ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యూజర్ల సమాచారాన్ని వారి కంట్రోల్‌లో ఉండేలా అద్భుతమైన ఫీచర్స్‌తో జియో ఈ బ్రౌజర్‌ను రూపొందించింది. క్రోమియం బ్లింగ్ ఇంజిన్‌తో ఈ వెబ్ బ్రౌజర్ పనిచేసే ఈ బ్రౌజర్.. తెలుగు, హిందీతో పాటు కన్నడ, తమిళ్, మరాఠీ, గుజరాతీ, మళయాళ, బెంగాళీ భాషల్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. జియో […]

Update: 2020-10-22 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రిలయెన్స్ జియో.. మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. డేటా ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యూజర్ల సమాచారాన్ని వారి కంట్రోల్‌లో ఉండేలా అద్భుతమైన ఫీచర్స్‌తో జియో ఈ బ్రౌజర్‌ను రూపొందించింది. క్రోమియం బ్లింగ్ ఇంజిన్‌తో ఈ వెబ్ బ్రౌజర్ పనిచేసే ఈ బ్రౌజర్.. తెలుగు, హిందీతో పాటు కన్నడ, తమిళ్, మరాఠీ, గుజరాతీ, మళయాళ, బెంగాళీ భాషల్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

జియో నెట్‌వెర్క్ మాదిరిగానే.. జియో పేజెస్ బ్రౌజర్ కూడా చాలా వేగంగా పనిచేస్తుందని నిర్వహకులు చెబుతున్నారు. ఇందులో వెబ్ పేజీలు చాలా వేగంగా లోడ్ కావడంతో పాటు వీడియోలను ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రీమింగ్‌లో చూడొచ్చు. జియో పేజెస్ బ్రౌజర్‌లో హోమ్ స్క్రీన్‌పై యూజర్లు తమకు ఇష్టమొచ్చిన సెర్చ్ ఇంజన్లను సెట్ చేసుకోవచ్చు. గూగుల్, బింగ్, ఎంఎస్ ఎన్, యాహు, డక్ డక్ గో వంటి సెర్చ్ ఇంజన్లలో ఏదైనా ఒక దాన్ని డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్‌గా సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు తమకు నచ్చిన వెబ్ పేజీలను హోమ్ స్క్రీన్‌పై పిన్ చేసుకోవచ్చు. పర్సనలైజ్డ్ థీమ్ ఫీచర్‌ను ఉపయోగించి అభిరుచిని బట్టి థీమ్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ‘డార్క్ మోడ్’ కూడా అవలేవబుల్‌గా ఉంది.

డౌన్‌లోడ్ చేసే ఫైల్స్‌ను ఇమేజ్, వీడియో, డాక్యుమెంట్, పేజెస్ అని వేర్వేరుగా కేటగరైజ్ చేయడానికి ‘అడ్వాన్స్‌డ్ డౌన్‌లోడ్ మేనేజర్’ ఫీచర్ యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ సాయంతో సులభంగా ఫైల్స్‌ను వెతుక్కోవచ్చు. ‌పిన్ లాక్డ్ ఇంకాగ్నిటో మోడ్, యాడ్ బ్లాక్ ప్లస్ ఫీచర్లతో పాటు యూజర్లు తమ భాష, టాపిక్, ప్లేస్ ఆధారంగా పర్సనలైజ్డ్ కంటెంట్‌ను పొందొచ్చు. ఎంచుకున్న టాపిక్స్ పైనే జియో పేజెస్ నోటిఫికేషన్లను పంపుతుంది. ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్‌, హెడ్‌లైన్స్‌ను ఇన్ఫర్మేటివ్ కార్డ్స్ ద్వారా చూడొచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న జియో పేజెస్ బ్రౌజర్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News