హుజూరాబాద్‌లో నిత్యం తనిఖీలు.. సీపీ సత్యనారాయణ కీలక ఆదేశాలు
దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం తనిఖీలు చేపడతామని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు తరలించే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఎన్నికలు ముగిసే వరకు తనిఖీలు కొనసాగిస్తామన్నారు. కమిషనరేట్‌లోని ప్రజలు, వ్యాపారులు ఆధారాలు లేకుండా లక్ష రూపాయల కన్న ఎక్కువ నగదు వెంట తీసుకెళ్లకూడదని సూచించారు. వస్తువులను రవాణా చేసేటప్పుడు సంబంధించిన రశీదులను దగ్గర ఉంచుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం […]
దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం తనిఖీలు చేపడతామని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు తరలించే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఎన్నికలు ముగిసే వరకు తనిఖీలు కొనసాగిస్తామన్నారు. కమిషనరేట్‌లోని ప్రజలు, వ్యాపారులు ఆధారాలు లేకుండా లక్ష రూపాయల కన్న ఎక్కువ నగదు వెంట తీసుకెళ్లకూడదని సూచించారు. వస్తువులను రవాణా చేసేటప్పుడు సంబంధించిన రశీదులను దగ్గర ఉంచుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆధారాలు లేని నగదు, వస్తువులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అక్రమార్కుల కదలికలను నిక్షిప్తం చేస్తారని అన్నారు. ప్రజలు తమవంతు సహకారాన్ని అందించి పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు.