కేవలం చిరుకే ఈ ఆఫర్: రెజీనా
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్‌గా నటించబోతున్నారు. చిరుకి జోడిగా త్రిష నటిస్తుండగా.. మహేష్‌కు జోడిగా పూజా హెగ్డే కనిపించబోతున్నారు. కానీ దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. […]
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్‌గా నటించబోతున్నారు. చిరుకి జోడిగా త్రిష నటిస్తుండగా.. మహేష్‌కు జోడిగా పూజా హెగ్డే కనిపించబోతున్నారు. కానీ దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే హీరోయిన్ రెజీనా… ‘ఆచార్య’ మూవీలో చిరు పక్కన స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిందట. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టమని… పైగా మెగాస్టార్ పక్కన డ్యాన్స్ చేయడం అంటే వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలిపింది రెజీనా. కానీ ఇదే నా కెరియర్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అని స్పష్టం చేసింది ఈ భామ. చిరు పక్కన కనిపించే ఛాన్స్ వదులుకోలేకే ఈ సాంగ్ చేశానని… ఇకపై ఎవరితోనూ స్పెషల్ సాంగ్ చేయబోనని తెలిపింది. ఆరు రోజుల పాటు జరిగిన సాంగ్ షూటింగ్ రాత్రి వేళల్లోనే జరిగిందని.. చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది. కాగా ‘ఎవరు’ సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకుని హిట్ అందుకున్న రెజీనా.. ఇప్పుడు ‘నేనే నా’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
tags: Megastar Chiranjeevi, Chiru Acharya, Acharya, Regina Cassandra, Chiru Regina, Ram Charan, Koratala Shiva