అందుకే లెస్బియన్‌గా నటించా : రెజీనా

హాట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా.. తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తోంది. కెరియర్ తొలినాళ్లలో ఎవడే సుబ్రహ్మణ్యం, పిల్లా నువ్వులేని జీవితం లాంటి సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్‌గా రాణించిన రెజీనా.. ‘ఎవరు’ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో కూడా మెప్పించింది. 2005లో ‘కంద నాల్ ముదల్’ సినిమాతో 15 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. ఆ చిత్రంలో హీరోయిన్ లైలాకు చెల్లెలిగా నటించింది. అయితే ఈ సినిమా ఫస్ట్ సీన్ చిత్రీకరణ సమయంలో […]

Update: 2020-08-15 04:12 GMT

హాట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా.. తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తోంది. కెరియర్ తొలినాళ్లలో ఎవడే సుబ్రహ్మణ్యం, పిల్లా నువ్వులేని జీవితం లాంటి సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్‌గా రాణించిన రెజీనా.. ‘ఎవరు’ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో కూడా మెప్పించింది.

2005లో ‘కంద నాల్ ముదల్’ సినిమాతో 15 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. ఆ చిత్రంలో హీరోయిన్ లైలాకు చెల్లెలిగా నటించింది. అయితే ఈ సినిమా ఫస్ట్ సీన్ చిత్రీకరణ సమయంలో భయంగా ఉందా? అని లైలా అడగ్గా.. లేదు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పిందట. అప్పుడు కెమెరా అంటే కేవలం ఎంజాయ్ చేసేదాన్నని, అసలు బాధ్యతగా ఎప్పుడూ ఫీల్ అవలేదని తెలిపిన రెజీనా.. ఇప్పుడు మాత్రం కెమెరాను ఫేస్ చేసేటప్పుడు ఆనందంతో పాటు బాధ్యతగా కూడా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది.

ఈ మధ్య ‘ఏ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. లెస్బియన్‌గా కనిపించింది. అయితే ఆ టైంలో చాలామంది అలాంటి పాత్రతో బాలీవుడ్‌కు ఎందుకు పరిచయం కావాలి? కాస్త వెయిట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. కానీ తను మాత్రం వినలేదని, చిన్న పాత్రయినా సరే.. చాలా ఇంపాక్ట్ ఉందని, పైగా సమాజానికి అవసరమైన విషయాన్ని టచ్ చేయగలుగుతుందని చేశానని తెలిపింది. ఈ సినిమా చూశాక చాలా మంది నుంచి అప్రిసియేషన్ కాల్స్ వచ్చాయని చెప్పింది భామ.

Tags:    

Similar News