ఆ రాజరాజేశ్వరునికి కారోనాకాటు.. రూ. కోట్ల నుంచి లక్షల్లోకి ఆదాయం
దిశ, వేములవాడ: తెలంగాణలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి కరోనా కాటు తప్పలేదు. రెండేళ్లుగా భక్తుల రాక తగ్గడం, లాక్ డౌన్‌తో ఆలయానికి పూర్తిగా ఆదాయం తగ్గిపోయింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం పదిరోజుల పాటు లాక్డౌన్ విధించడంతో ఆలయం పూర్తిగా మూసివేశారు. స్వామి వారికి అంతరాలయంలో నిత్య కైంకర్యాలు సాగుతున్నాయి. రెండేళ్లుగా తగ్గిన ఆదాయం గత రెండేళ్లుగా స్వామి వారి దర్శనం […]
దిశ, వేములవాడ: తెలంగాణలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి కరోనా కాటు తప్పలేదు. రెండేళ్లుగా భక్తుల రాక తగ్గడం, లాక్ డౌన్‌తో ఆలయానికి పూర్తిగా ఆదాయం తగ్గిపోయింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం పదిరోజుల పాటు లాక్డౌన్ విధించడంతో ఆలయం పూర్తిగా మూసివేశారు. స్వామి వారికి అంతరాలయంలో నిత్య కైంకర్యాలు సాగుతున్నాయి.
రెండేళ్లుగా తగ్గిన ఆదాయం
గత రెండేళ్లుగా స్వామి వారి దర్శనం చేసుకునేందుకు కరోనా అడ్డంకిగా మారింది. దీంతో భక్తుల రద్దీ తగ్గడం తో కోడె మొక్కులు, ఆర్జిత సేవలు, లడ్డూ, తలనీలాలు ద్వారా ఆలయానికి వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గింది. గత ఏడాది కరోనా కారణంగా ఆలయాన్ని 79 రోజులు మూసివేశారు. 1978 లో కలరా వ్యాధి రావడం తో 42 రోజులు మూసివేశారు. తిరిగి 42 ఏళ్ల తర్వాత కరోనా ఎఫెక్ట్ కు పది రోజులు మూసివేశారు. మార్చి 31శివ కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో కొంత మంది ఆలయ అధికారులు కరోనా బారిన పడ్డారు. దీంతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారని భావించిన ఆలయాధికారులు 5 రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు. గత ఏడాది ఆలయానికి రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల మేర ఆదాయం రాగా కరోనా కారణంగా ఈ ఏడాది కేవలం రూ.48 కోట్లు మాత్రమే వచ్చింది. కోట్లలో వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. కరోనా ఎఫెక్ట్ మానవాళిని గడగడ వనికిస్తుండగా , అదిదేవునికి కూడా కరోనా కాటు తప్పడం లేదని భక్తులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.