కేసీఆర్ ఫ్యామిలీలో ఒక్కసారిగా మార్పు.. ఎందుకంటే ?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజెంట్ ట్రెండింగ్ వర్డ్ ‘కేసీఆర్ ఫ్యామిలీలో ఒక్కసారిగా మార్పు’. గతవారం రోజులుగా పొలిటికల్ లీడర్స్‌తో పాటు గ్రామాల్లోని గల్లీ లీడర్స్ సైతం ఈ అంశంపైనే ప్రధానంగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. అసలు ఒక్కసారిగా కేసీఆర్, కేటీఆర్, కవితలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది. మొన్నటివరకు గప్‌చుప్‌గా వ్యవహరించిన వారు ఇప్పుడు ఏఅంశాన్ని పరిగణనలోకి తీసుకొని ముందుకు పోతున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న తర్వాతే వారి […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజెంట్ ట్రెండింగ్ వర్డ్ ‘కేసీఆర్ ఫ్యామిలీలో ఒక్కసారిగా మార్పు’. గతవారం రోజులుగా పొలిటికల్ లీడర్స్‌తో పాటు గ్రామాల్లోని గల్లీ లీడర్స్ సైతం ఈ అంశంపైనే ప్రధానంగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. అసలు ఒక్కసారిగా కేసీఆర్, కేటీఆర్, కవితలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది. మొన్నటివరకు గప్‌చుప్‌గా వ్యవహరించిన వారు ఇప్పుడు ఏఅంశాన్ని పరిగణనలోకి తీసుకొని ముందుకు పోతున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న తర్వాతే వారి విధానాలను మార్చుకున్నారన్న చర్చలు రాజకీయ అభిమానుల మధ్య జరుగుతుండగా.. ఇది ఇప్పటివరకేనా? లేకుంటే ముందు ముందు ఇలాగే అనుసరిస్తారా? అన్న సందేహాలు పొలిటికల్ సర్కిల్స్‌లో రైజ్ అవుతుండటం గమనార్హం.
2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిన్నటి జీహెచ్ఎంసీ ఫలితాల వరకు ‘కేసీఆర్, కేటీఆర్, కవిత.. యావరేజ్ పొలిటికల్ లీడర్లను అస్సలు పట్టించుకోరు. వారి అపాయింట్‌మెంట్ దొరకడం అసాధ్యం’ అన్న అభిప్రాయాలే వినపడ్డాయి. అధికారం వాళ్లు ముగ్గురే అనుభవిస్తూ కనీసం టీఆర్ఎస్ శ్రేణులను సైతం కలవరు, అంతేకాదు వాళ్ల ఇళ్లలో కార్యక్రమాలకు కూడా వెళ్లరన్న గాసిప్స్ వచ్చాయి. ఇక కేసీఆర్ అయితే ప్రగతి భవన్ వీడరు. వెళ్తే ఫాంహౌస్, లేకుంటే ఢిల్లీ టూర్ చేపడుతారన్న ఒకరకమైన చర్చ ఎప్పటినుండో ఉంది. దీన్నే పాయింట్‌గా పట్టిన బీజేపీ, కాంగ్రెస్.. అన్ని ఎన్నికల్లో ఇదే అంశాన్ని కేసీఆర్‌పై సంధిస్తూ ప్రచారం చేసి, ఫలితాన్ని సాధించాయి. దీంతో గ్రేటర్ రిజల్ట్ వచ్చిన రెండో రోజు నుంచే మంత్రి కేటీఆర్ వరుస పర్యటనలకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఖమ్మం జిల్లాలో ఐటీ ప్రారంభించడం, ఆ వెంటనే రెండ్రోజులు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటనలు, టీఆర్ఎస్ పార్టీ నేతల కొడుకులు, కూతుర్ల వివాహాలకు హాజరవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం కేసీఆర్ సైతం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూతురు వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం, తర్వాత సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి ప్రజలకు వరాల జల్లు కురిపించడం ఒక్కసారిగా పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రానికి సంబంధించిన నిధులపై ఢిల్లీ వెళ్లి మంతనాలు జరుపుతుండటం మరో విశేషం. అటు ఎమ్మెల్సీ కవిత సైతం టీఆర్ఎస్ కార్యకర్తల వివాహాలకు హాజరై అందరితో కలిసిపోతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల సమయంలో ‘ఈ ముగ్గురు జనాల్లో కలవరు, వీళ్లకు ప్రగతి భవన్ ఉంటే చాలు’ అన్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని ముందుగా పెళ్లిళ్లకు హాజరవుతున్న కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్.. త్వరలో గ్రామాల్లో చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు దగ్గరవుతారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇంతేగాక కేసీఆర్ త్వరలో బస్సు యాత్ర చేపడుతారని.. రాబోయే మూడేళ్ల కాలంలో ఈ ముగ్గురు కూడా ప్రజల్లో ఉండేందుకే కార్యాచరణ రూపొదించబోతున్నారన్న ఊహాగానాలు వినిపించబోతున్నాయి. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల ఎఫెక్ట్‌తోనే బయటకొచ్చి జనాల్లోనే ఉంటామన్న ఫీలింగ్ కలుగజేస్తున్న వీరు… పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల తర్వాత.. మళ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడే దర్శనం ఇస్తారన్న విమర్శలు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినపడుతున్నాయి.