AP High Court: ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు.. రిట్ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan)లపై సోషల్ మీడియా (Social Media)లో ఆసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్, ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

Update: 2024-11-28 09:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan)లపై సోషల్ మీడియా (Social Media)లో ఆసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్, ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను వచ్చే నెల 2 తేదీకి వాయిదా వేసింది.

అయితే, రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని ఆర్జీవీ (RGV) తన పిటిషన్‌లో వెల్లడించారు. తాను కామెంట్ చేసిన వ్యక్తులు కాకుండా.. సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనపై ఎఫ్ఐఆర్‌ (FIR)లు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. ఇప్పటికే ఆర్జీవీ (RGV)పై మూడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఆయన కోసం ఒంగోలు, ప్రకాశం పోలీసులు బృందాలుగా విడిపోయి తీవ్రంగా గాలిస్తున్నారు. అయినా కానీ ఆర్జీవీ అజ్ఞాతాన్ని వీడటం లేదు.  

Tags:    

Similar News