అందులో వాటాను పెంచుకోవడమే లక్ష్యం : రియల్‌మీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఇటీవల దేశీయంగా ఆదరణ పెరుగుతున్న రూ. 10,000-రూ. 20,000 మధ్య 4జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరింత పట్టు సాధించనున్నట్టు వెల్లడించింది. రియల్‌మీ 8 సిరీస్ ద్వారా ఈ విభాగంలో 10-15 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా చేసుకున్నట్టు రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ చెప్పారు. భారత మార్కెట్లో యువ వినియోగదారులను ఆకట్టుకోవడమే కంపెనీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘ఈ మధ్య కాలంలో 4జీ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్న […]

Update: 2021-03-25 10:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఇటీవల దేశీయంగా ఆదరణ పెరుగుతున్న రూ. 10,000-రూ. 20,000 మధ్య 4జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరింత పట్టు సాధించనున్నట్టు వెల్లడించింది. రియల్‌మీ 8 సిరీస్ ద్వారా ఈ విభాగంలో 10-15 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా చేసుకున్నట్టు రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ చెప్పారు. భారత మార్కెట్లో యువ వినియోగదారులను ఆకట్టుకోవడమే కంపెనీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

‘ఈ మధ్య కాలంలో 4జీ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్న వినియోగదారులు పెరిగారు. దీంతో కంపెనీ 4జీ, 5జీ సెగ్మెంట్ విభాగంపై దృష్టి సారించినట్టు’ మాధవ్ సేథ్ తెలిపారు. భారత మార్కెట్లో కంపెనీ ప్రధానంగా ‘5జీ లీడర్’, ‘రియల్‌మీ టెక్‌లైఫ్’ వంటి రెండు లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. ప్రస్తుత రియల్‌మీ 20 లక్షల వినియోగదారులను కలిగి ఉంది. భవిష్యత్తులో మరింత వేగంగా కొత్త వినియోగదారులను ఆకట్టుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. ఎప్పటికప్పుడు వినియోగదారులతో అనుసంధానమవుతూ, కొత్త ఉత్పత్తులను తీసుకురానున్నాం. దీంతో కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని సాధిస్తుందని మాధవ్ సేథ్ వెల్లడించారు.

Tags:    

Similar News