బంగారు రుణ సంస్థలకు ఆర్‌బీఐ భారీ షాక్

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బంగారు తనఖా సంస్థలైన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. నిర్దేశించిన నిబంధనలను పాటించలేదనే కారణంతో ఇరు సంస్థలపై జరిమానా విధించింది. ముత్తూట్ ఫైనాన్స్‌కు రూ. 10 లక్షలు, మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 5 లక్షల జరిమాణా విధిస్తూ ప్రకటన విడుదల చేసింది. ముత్తూట్ ఫినాన్స్ సంస్థ 2018 నుంచి 2019 మధ్య కాలంలో బంగారం లోన్‌లకు సంబంధించి లోన్ టూ వ్యాల్యూ రేషియో […]

Update: 2020-11-20 08:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బంగారు తనఖా సంస్థలైన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. నిర్దేశించిన నిబంధనలను పాటించలేదనే కారణంతో ఇరు సంస్థలపై జరిమానా విధించింది. ముత్తూట్ ఫైనాన్స్‌కు రూ. 10 లక్షలు, మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 5 లక్షల జరిమాణా విధిస్తూ ప్రకటన విడుదల చేసింది.

ముత్తూట్ ఫినాన్స్ సంస్థ 2018 నుంచి 2019 మధ్య కాలంలో బంగారం లోన్‌లకు సంబంధించి లోన్ టూ వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను అనుసరించలేదని, నిబంధనలను పాటించకపోవడం వల్ల రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నామని ఆర్‌బీఐ పేర్కొంది. అదేవిధంగా రూ. 5 లక్షల మించి బంగారు రునాలను ఇచ్చే ముందు రుణాలను తీసుకున్న వారి నుంచి పాన్‌కార్డ్ తీసుకోలేదని, అందుకే జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. మరో సంస్థ మణప్పురం ఫైనాన్స్ కూడా 2019, మార్చి చివరి నాటికి సంస్థ ఆర్‌బీఐ ఆదేశాలను అనుసరించలేదని తేలినట్టు, అందుకోసం రూ. 5 లక్షల జరిమానా విధించినట్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News