వారి నియామకానికి ఆర్‌బీఐ మార్గదర్శకాల జారీ

దిశ, వెబ్‌డెస్క్: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్‌సీ)లతో పాటు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) చట్టబద్ధమైన ఆడిటర్లను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. ‘2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్య బ్యాంకులు(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), పట్టణ సహకార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ(హెచ్ఎఫ్‌సీ సహా)లలో స్టాట్యూటరీ సెంట్రల్ ఆడిటర్స్(ఎస్‌సీఏ), స్టాట్యూటరీ ఆడిటర్స్(ఎస్ఐ)ల నియామకానికి మార్గదర్శకాలు వర్తిస్తాయి. అయితే, రూ. వెయ్యి కోట్ల కంటే తక్కువ ఆస్తి పరిమాణం కలిగిన ఎన్‌బీఎఫ్‌సీలు ప్రస్తుత విధానాలనే […]

Update: 2021-04-27 03:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్‌సీ)లతో పాటు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) చట్టబద్ధమైన ఆడిటర్లను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. ‘2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్య బ్యాంకులు(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), పట్టణ సహకార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ(హెచ్ఎఫ్‌సీ సహా)లలో స్టాట్యూటరీ సెంట్రల్ ఆడిటర్స్(ఎస్‌సీఏ), స్టాట్యూటరీ ఆడిటర్స్(ఎస్ఐ)ల నియామకానికి మార్గదర్శకాలు వర్తిస్తాయి.

అయితే, రూ. వెయ్యి కోట్ల కంటే తక్కువ ఆస్తి పరిమాణం కలిగిన ఎన్‌బీఎఫ్‌సీలు ప్రస్తుత విధానాలనే కొనసాగించే అవకాశం ఉంది. ఈ మార్గదర్శకాలు ఎస్‌సీఏ, ఎస్ఐల నియామకానికి, ఆడిటర్ల సంఖ్య, వారి అర్హత ప్రమాణాలు, పదవీకాలం, రొటేషన్ వంటి సూచనల ద్వారా ఆడిటర్ల స్వాతంత్ర్యాన్ని నిర్ధారించనున్నాయి. 2021-22 నుంచి పట్టణ సహకార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో సగం నుంచి అనుసరించే వెసులుబాటును ఆర్‌బీఐ ఇచ్చింది. ఈ ఆడిటర్ల నియామకం కోసం బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు ఆర్‌బీఐ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 15 వేల కోట్ల ఆస్తి పరిమాణం ఉన్న సంస్థలకు కనీసం రెండు ఆడిట్ సంస్థల ఉమ్మడి ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన ఆడిట్ నిర్వహించేందుకు మిగిలిన అన్ని సంస్థలు కనీసం ఒక ఆడిట్ సంస్థను నియమించాలి.

Tags:    

Similar News