శభాష్ బెంగాల్ సుల్తాన్.. షమీపై రవిశాస్త్రి ప్రశంసలు

దిశ, వెబ్‌డెస్క్: సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో 3వ రోజు మహ్మద్ షమీ 5 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. సఫారీ బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో షమీ కీలక పాత్ర వహించాడు. ఈ ఐదు వికెట్లతో.. టెస్టు మ్యాచుల్లో 200 వికెట్ల మైలురాయిని సాధించిన 5వ పేస్ బౌలర్‌‌గా నిలిచాడు. ఈ ప్రతిభతో టీమిండియా మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మహ్మద్ షమీ ప్రదర్శన పట్ల టీమిండియా మాజీ హెడ్‌కోచ్ […]

Update: 2021-12-29 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో 3వ రోజు మహ్మద్ షమీ 5 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. సఫారీ బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో షమీ కీలక పాత్ర వహించాడు. ఈ ఐదు వికెట్లతో.. టెస్టు మ్యాచుల్లో 200 వికెట్ల మైలురాయిని సాధించిన 5వ పేస్ బౌలర్‌‌గా నిలిచాడు. ఈ ప్రతిభతో టీమిండియా మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక మహ్మద్ షమీ ప్రదర్శన పట్ల టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. శభాష్ బెంగాల్ సుల్తాన్ అంటూ కొనియాడాడు. నీ ప్రదర్శన చూస్తే మజా వచ్చింది. నీ శ్రమకు ఫలితం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. తొలి టెస్టులో షమీ నుంచి అద్భుతమైన ప్రదర్శన చూశామని వీవీఎస్ లక్ష్మణ్ గుర్తు చేశాడు. ఇక ఇదే ఉత్సాహంతో సఫారీ గడ్డ మీద టీమిండియా విజయకేతనం ఎగురవేయాలని టీమిండియా ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News