6 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితులను ఉరి తీయాలని రాస్తారోకో
దిశ, బోథ్: 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం, హత్యను నిరసిస్తూ బోథ్ మండల కేంద్రంలో భారీ నిరసన, రామారావు మహారాజు విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గోర్ సేన నాయకులు మాట్లాడుతూ.. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న వారు మనుషులు కాదు.. పశువుల కన్నా హీనమైన బ్రతుకు వారిది.. అక్కడే కాదు.. ప్రతి చోటా ఇలాంటి రాక్షసులు ఉంటారు కాబట్టి వచ్చే తరాలను రక్షించాల్సిన బాధ్యత మీ యువత పైనే ఆధారపడి ఉంది. […]
దిశ, బోథ్: 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం, హత్యను నిరసిస్తూ బోథ్ మండల కేంద్రంలో భారీ నిరసన, రామారావు మహారాజు విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గోర్ సేన నాయకులు మాట్లాడుతూ.. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న వారు మనుషులు కాదు.. పశువుల కన్నా హీనమైన బ్రతుకు వారిది.. అక్కడే కాదు.. ప్రతి చోటా ఇలాంటి రాక్షసులు ఉంటారు కాబట్టి వచ్చే తరాలను రక్షించాల్సిన బాధ్యత మీ యువత పైనే ఆధారపడి ఉంది. ఆ పాప కుటుంబానికి మండల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని అన్నారు.
పాపపై అత్యాచారం జరగడం ప్రభుత్వాల అసమర్ధపు పాలనకు నిదర్శనమని, అలాంటి నీచులను కఠినంగా శిక్షించే ఆర్డినెన్స్ లు తేవాలని డిమాండ్ చేశారు. దేశమంతటా స్త్రీ జాతిని రక్షించే చర్యలు తేవాలి అని తెలిపా.రు ఈ కార్యక్రమంలో గోర్ సేన జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్ గోర్, సేన మండల అధ్యక్షుడు జాదవ్ శశి కుమార్, దేవిదాస్ రాథోడ్ విష్ణు జాదవ్ కృష్ణ, జాదవ్ ఉమేశ్ జాదవ్ , బోత్ మండల బంజారా నాయకులు, మహిళలు పాల్గొన్నారు.