కేవలం లక్కుతో స్టార్ ఇమేజ్ పొందలేదు: రష్మిక

        రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… చేసిన ప్రతీ సినిమాలో తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంది. 2017లో ఛలో సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసి స్వీట్ అండ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత వెంటనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం చిత్రం రష్మికను వెనక్కి […]

Update: 2020-02-17 04:22 GMT

రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… చేసిన ప్రతీ సినిమాలో తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంది. 2017లో ఛలో సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసి స్వీట్ అండ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత వెంటనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం చిత్రం రష్మికను వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాలో రౌడీకి ధీటుగా నటించిన రష్మిక విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తర్వాత నానితో దేవదాసు, విజయ్‌తో డియర్ కామ్రేడ్ సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నితిన్‌తో జోడీ కట్టిన భీష్మ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఇది తనకు 10వ సినిమా.

కేవలం పది సినిమాలతోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మికను చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. #Rashmika10 ట్యాగ్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దీంతో అప్పుడే పది సినిమాలు చేశానా అంటూ ఆశ్చర్యపోతోంది రష్మిక. నాకు ఇంకా సినిమా ప్రపంచం కొత్తగానే అనిపిస్తుంది అని తెలిపింది. మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు వచ్చానని చెప్పిన రష్మి… పది సినిమాలు చేసినందుకు కాదు.. మీలాంటి సపోర్టింగ్ సిస్టెమ్‌ను పొందినందుకు సెలబ్రేషన్స్ చేసుకోవాలని .. లవ్ యూ ఆల్ అంటూ ఫ్యాన్స్ కోసం పోస్ట్ పెట్టింది.

ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రష్మిక. పది సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోవడంలో అదృష్టం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్‌లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుని … ఆ పాత్ర కోసం కష్టపడ్డానని తెలిపింది. బెస్ట్ స్క్రిప్ట్స్ ఎంచుకునే క్రమంలో ఇప్పటి వరకు దాదాపు 50 స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేసి ఉంటానంది. అలాగని సూపర్ స్టార్స్‌తో నటించాలనే ఆశతో చిన్న సినిమాలను ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదని చెప్పింది.

Tags:    

Similar News