సింపుల్‌గా క‌నిపిస్తూ స్టైలిష్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్న హీరో.. పోస్టర్ వైరల్

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్వ్కేర్’ హిట్స్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నల‌గ‌డ్డ(Siddhu Jonnalagadda) హీరోగా న‌టిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్- కొంచెం క్రాక్‌(Jack Konchem Crack)'.

Update: 2025-01-01 17:13 GMT

దిశ, సినిమా: ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్వ్కేర్’ హిట్స్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నల‌గ‌డ్డ(Siddhu Jonnalagadda) హీరోగా న‌టిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్- కొంచెం క్రాక్‌(Jack Konchem Crack)'. బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకోవడంతో.. తాజాగా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ పరిశీలిస్తే.. సిద్ధు సింపుల్‌గా క‌నిపిస్తూ స్టైలిష్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. సిద్ధు టైటిల్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ మూవీపై ఆడియెన్స్‌లో మంచి అంచ‌నాలున్నాయి. ఫ‌న్ రైడ‌ర్‌లా అంద‌రినీ మెప్పించే క‌థాంశంతో ఈ చిత్రం మ‌న ముందుకు రానుంది. ఇందులో వైష్ణవి చైత‌న్య హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. ప్రకాష్ రాజ్‌, నరేష్‌, బ్రహ్మాజీ త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో మెప్పించ‌నున్నారు.

Tags:    

Similar News