HIT: హిట్-3 నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. నాని ఎలా ఉన్నాడంటే?
నేచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శైలేష్ కొలను(Shailesh Kolanu) కాంబోలో రాబోతున్న హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: The 3rd Case’.
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శైలేష్ కొలను(Shailesh Kolanu) కాంబోలో రాబోతున్న హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: The 3rd Case’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని(Prashanti Thipirneni) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్, లుక్స్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన న్యూ ఇయర్ స్పెషల్‌గా మరో పోస్టర్ రిలజ్ చేశారు మేకర్స్. ఇందులో నాని రా అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. కాగా.. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్(Arjun Sarkar) అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండగా.. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో సినిమాపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ భారీ అంచనాల మధ్య మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంద