Klinkaara: సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన.. క్లిన్‌కారా క్యూట్ వీడియో షేర్ చేయడంతో ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్(పోస్ట్)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) పెళ్లైన 11 ఏళ్లకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే.

Update: 2025-01-04 08:13 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) పెళ్లైన 11 ఏళ్లకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాపకు క్లిన్ కారా(Klinkaara) అని నామకరణం చేశారు. కానీ ఆమె పుట్టిన కానుంచి మాత్రం ముఖం రివీల్ చేయలేదు. కానీ మెగా ఫ్యామిలీ మొత్తం తన వల్లే లక్ కలిసి వస్తుందంటూ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.

అయితే మెగా అభిమానులు గ్లోబల్ స్టార్ ప్రిన్సెస్‌ను చూడాలని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇక గత ఏడాది క్లిన్ కారా పుట్టినరోజు నాడు అయినా చూపిస్తారని అంతా భావించారు. కానీ ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఆమె ఫేస్‌ను చూపించలేదు. అప్పుడప్పుడు ఫొటోలు(Photos) షేర్ చేస్తూ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నారు తప్ప ముఖం రివీల్ చేయడం లేదు. దీంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఉపాసన తర గారాలపట్టి క్లిన్ కారా(Klinkaara) వీడియోను షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఇందులో రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) సినిమా డాక్యుమెంటరీ వీక్షించిన క్లిన్ కారా తన తండ్రిని తొలిసారి టీవీలో చూసి ఎంతో ఉత్సాహంగా కనబడింది. మాటలు రాకున్నా కేకలు వేస్తూ ఎక్జైటింగ్‌గా ఫీల్ అయింది. ఇక ఈ వీడియోను ఉపాసన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘‘మిమ్మల్ని చూస్తూ చాలా గర్వంగా ఉంది. గేమ్ ఛేంజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసి రెడ్ హార్ట్ సింబల్స్ షేర్ చేసింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆనందపడుతున్నారు.  

Tags:    

Similar News